దేశహితం కోసమే కొంత మంది ఆకతాయిల ఆగడాలను మౌనంగా సహించానని సీఆర్పీఎఫ్ జవాను విశ్వకర్మ చెప్పారు. కాశ్మీర్ లో సీఅర్పీఎఫ్ పై కాశ్మీరీ యువకులు కొందరు దాడిచేస్తున్న వీడియోలో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ విడియోలో ఉన్న విశ్వకర్మ అనే సీఆర్పీఎప్ జవాను సెలవు పై స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తనను రకరకాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన తాను సంయవనంలో వ్యవహరించానని అన్నారు. తమని తాము రక్షించుకుంటూ నిగ్రహాన్ని కోల్పోకుండా ఎట్లా ఉండాలనేది తమకు శిక్షణ ఇచ్చారని విశ్వకర్మ పేర్కొన్నారు. అత్యంత సున్నితమైన ఆ ప్రాంతంలో తాను విధులు నిర్వహించానని పాకిస్థాన్ జిందాబాద్, ఇండియా గోబ్యాక్ అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని అయినా తాము సంయవనం కోల్పోకుండా నిధులు నిర్వహించినట్టు చెప్పారు. తమపై రాళ్లు రువ్వే ప్రయత్నం చేశారని ఆ తరువాత దాడికి ప్రయత్నించారని వివరించారు. రాళ్ల దాడులకు తాము భయపడే ప్రశక్తి లేదని అన్నారు. తాము నియంత్రణ కోల్పోయి కాల్పులు జరిపితే పరిస్థితి మరింత విషమిస్తుందనే తాము మౌనంగా ఉండిపోయామన్నారు.
తాను భారతమాత సేవ కోసమే సీఅర్పీఎఫ్ లో చేరానని చెప్పుకొచ్చారు. తాను తిరిగి కాశ్మీర్ లో విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. తన ఆఖరి ఊపిరి వరకు దేశ సేవచేస్తానన్నారు. తన కుమారుడి పనితీరు చూసి తాను గర్వపడుతున్నట్టు విశ్వకర్మ తల్లి చెప్పారు. సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సమయంలో తాను కొంత కలవరపడ్డానని అయితే అతని పనితీరు చూసి దేశప్రజలతో పాటుగా తాను గర్వపడుతున్నానని అన్నారు.