సెలవలు ఇచ్చేశారోచ్….

తెలంగాణలో వేసవి సెలవులను మూడురోజులు ముందుగానే ప్రకటించారు. వాస్తవానికి ఈనెల 23 నుండి వేసవి సెలవులు ఇవ్వాల్సి ఉండగా రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల ముందుగానే సెలవులు ప్రకటించింది. గురువారం నుంచే తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవలు ప్రకటిస్తున్నట్టు విద్యాశాఖ తెలిపింది. ఎండలు తీవ్రంగా ఉంటుండడంతో వెంటనే సెలవలు ప్రకటించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు విద్యాశాఖ వెంటనే సెలవలు ప్రకటించినట్టు తెలుస్తోంది. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లోనూ  ఉష్ణోగ్రతలు మండిపోతున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించిన నేపధ్యంలో వేసవి సెలవులను మరో మూడూ రోజులు ముందుకుకు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విద్యార్థులు, వారి తల్లి దండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *