రసవత్తర రాజకీయాలకు తమిళనాడు వేదికయ్యింది. ఒక్కప్పుడు చిన్నమ్మ కు జై కొట్టిన వారు ఇప్పుడు ఛీత్కరిస్తున్నారు. సాహో అంటూ సాగినపడ్డ వారు ఛీపో అంటున్నారు. కాళ్లు మొక్కిన నాయకగణం అదే కాళ్లు పట్టి గుంజుతున్నారు. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే పార్టీనీ, తమిళనాడు ప్రభుత్వాన్ని కంటిచూపుతో నడిపించాలనుకున్న శశికళ ప్రస్తుతం దారుణంగా దెబ్బతిని అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.
- శశికళకు చుక్కెదురు. జైలు నుండి చక్రం తిప్పాలనుకున్న శశికళను అనుకూలించని పరిస్థితులు.
- పార్టీ నుండి అత్యంత అవమానకర రీతిలో సాగనంపే పరిస్థితి.
- పార్టీపై సడలిన పట్టు.
- మెడకు చుట్టుకున్న అవినీతి ఆరోపణలు.
- జయలలిత సన్నిహితురాలిగా అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ తెరవెనుక చక్రం తిప్పిన శశికళ.
- జయ మరణం తరువాత అన్నీ తానై వ్యవహరించిన చిన్నమ్మ.
- పార్టీ పగ్గాలు చేపట్టి జయకు తానే వారసురాలినంటూ ప్రచారం.
- సుప్రీంకోర్టు తీర్పుతో జైలుకు వెళ్లాల్సి రావడంతో దక్కని ముఖ్యమంత్రి పీఠం.
- జైలు నుండి చక్రం తిప్పే ప్రయత్నం.
- అడ్డం తిరిగిన అనుచరులు.
- జయలలిత దూరం పెట్టిన దినకరన్ కు పెద్దపీట వేయడంతో మొదలైన పతనం.
- జయలలిత మరణం పై తమిళ ప్రజల్లో అనుమానాలు.
- చిట్టుముట్టిన అవినీతి వ్యవహారం.
- ఏకంగా ఎన్నికల సంఘానికి లంచం ఇచ్చే ప్రయత్నం చేయడంతో పీకల్లోతు కష్టాలు.
- శశికళ మాఫియా ఆగడాలపై తమిళ ప్రజల్లో ఆగ్రహం.
- అడ్డం తిరిగిన అనుచరులు.
- చక్రం తిప్పిన ఢిల్లీ పెద్దలు.
మొత్తం మీద జయలలిత తరహాలో జైలు నుండే చక్రం తిప్పుదామనుకున్న శశికళకు ఒకదాని తరువాత మరొకటిగా తగిదిన ఎదురుదెబ్బలతో పూర్తిగా కుదేలయింది. పార్టీ నుండి ఇప్పుడు బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నాడీఎంకే పార్టీనీ, ప్రభుత్వాన్ని తన కను సన్నల్లో నడుపుదామనుకున్న పరిస్థతి ప్రస్తుతం దారుణంగా మారింది.