భారత పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా లండన్ లో అరెస్ట్ అయిన కొద్ది సేపటికే బెయిల్ పై విడుదల అయ్యారు.దేశంలోని వివిధ బ్యాంకులకు 9వేల కోట్లకు పైగా బాకాయిలున్న విజయ్ మాల్యాపై భారత్ లో పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపధ్యంలో లండన్ పోలీసులు మాల్యాను అరెస్టు చేసిన కొద్ది సేపట్లోనే షరతులతో కూడిన బెయిల్ మంజూరుకావడంతో గంటల్లోనే విడుదల అయ్యారు. భారత్ జారీ చేసిన లెటర్ ఆఫ్ రెగోరేటరీ ఆధారంగా యూకే పోలీసులు మాల్యాను అరెస్టు చేశారు. మాల్యాను లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరో వైపు మాల్యాను భారత్ కు తీసుకుని వచ్చేందుకు సీబీఐ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది.