మావో అగ్రనేత నారాయణ సన్యాల్ మృతి

మావోయిస్ట్ పార్టీ అగ్రనేత నారాయణ సన్యాల్ అనారోగ్యంతో కోల్ కతా లోని ఒక ఆస్పత్రిలో కన్నుమూశారు. నిషేధిత మావోయిస్టు పార్టీలో  కేంద్ర ప్రధాన కార్యదర్శి ముపాళ్ల లక్ష్మణ్ రావు తరువాతి స్థానంలో ఉన్న సన్యాల్ గత  కొద్ది కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. 80 సంవత్సరాల సన్యాల్ భారతదేశంలోని సీపీఐ ఎం.ఎల్ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరించారు. 2005లో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుండి జైల్లో ఉన్న ఆయన 2014లో విడుదలయ్యారు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న ఆయన సోమవారం రాత్రి ఆస్పత్రిలో కన్నుమూశారు.
అవిభక్త బెంగాల్ రాష్ట్రంలోని ఉన్నత కుటుంబంలో జన్మించిన సన్యాల్ తండ్రి కాంగ్రెస్ కీలక నేతల్లో ఒకరు. పశ్చమ బెంగాల్ కు ముఖ్యమంత్రిగా పనిచేసిన బిదిన్ చంద్ర రాయ్ తో పాటుగా సరోజని నాయుడు లాంటి కీలక నేతలు  నారాయణ సన్యాల్ చిన్నతనంలో వాళ్లింటి వస్తుండేవారు. మొదట ఫుట్ బాల్ పై అమిత ఆశక్తి చేపేవారు. 1940లో సన్యాల్ కుటుంబం పశ్చిమ బెంగాల్ లో స్థిరపడింది. తొలుత బ్యాంక్ ఉద్యోగం చేసిన సన్యాల్ అప్పుడే సీపీఐ ఎం.ఎల్ విధానాలపై వైపు ఆకర్షితుదయ్యారు. ఉధ్యమంలో పాల్గొంటూ అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయిన ఆయన్ను 1972లో ఒకసారి అరెస్టు చేశారు. అప్పటి నుండి 1976 వరకు జైల్లోనే ఉండిపోయిన ఆయన నక్సలైట్లకు క్షమాభిక్ష పథకం కింద విడుదల అయ్యారు. విడుదలైన తరువాత కూడా తిరిగి ఉద్యమబాట పట్టిన ఆయన పలు కీలక పదవులు నిర్వహించారు. 2005 అరెస్ట్ అయ్యే నాటికి మావోయిస్టు పార్టీలో నెంబర్ -2 గా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *