కొరియాలో అణుయుద్ధం తప్పదా…!

అమెరికాతో ఎటువంటి యుద్ధానికి అయినా సిద్ధంగా ఉన్నామని ఉత్తర కొరియా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా తమ భూబాగంపై దాడులు చేస్తే దానికి తగిన విధంగా బుద్ది చెప్తామని, అమెరికా క్షిపణి దాడులు చేస్తే తాము క్షిపణులను ప్రయోగిస్తామంటూ ఘాటుగా హెచ్చరికలు పంపింది. అటు అమెరికా యుద్ధ నౌకలు కొరియా ద్వీపకల్పానికి చేరువగా వస్తున్నాయి. దీనితో కొరియా ద్వీప కల్పంలో తీవ్ర ఉధ్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తర కొరియా ఇప్పటికే యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టినట్టి వస్తున్న వార్తలు కలవర పెడుతున్నాయి. అమెరికా హెచ్చరికలకు లొంగేది లేదని ఉత్తర కొరియా అధ్యక్షుడు  కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించగా ఉత్తర కొరియాను దారికి తెచ్చితీరుతామని అమెరికా అధ్యక్షుడు  డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం సర్వత్రా నెలకొని ఉంది. అమెరికా, ఉత్తర కొరియాల మధ్య యుద్ధం వస్తే అది భీకరంగా ఉంటుందని ప్రపంచంలో తొలి అణు యుద్ధానికి దారితీసే ప్రమాదం కూడా ఉందనే భయం వేంటాడుతోంది. ఎవరికి వారు పట్టదలలకు పోతుండడంతో ఉత్తర కొరియాలో యుద్ధమేఘాలు తొలగడం లేదు.
యుధ్దం అంటూ వస్తే అణ్యాయుధ ప్రయోగం జరిపితీరతామంటూ ఉత్తర కొరియా చేస్తున్న హెచ్చరికలు కలవరపెడుతున్నాయి. ఉత్తర కొరియా-అమెరికాల మధ్య యుద్ధంలో చైనా, రష్యాలు వేలు పెడితే అది మరింత విశానానికి దారితీసే ప్రమాదం కనిపిస్తోంది. 1950లో జరిగిన కొరియా యుద్ధంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 25 లక్షల మందికి పైగా ప్రజల ప్రాణాలు పోగా ఇరువైపులా దాదాపు ఎనిమిది లక్షల మంది సైనికులు బలయ్యారు. దక్షిణ కొరియాకు మద్దతుగా అమెరికా దాని మిత్రపక్షాలు కదనరంగంలో కాలు మోపగా చైనా ఉత్తర కొరియాకు మద్దతుగా పోరాడింది. రష్యా ఉత్తర కొరియాకు సైనిక సహాయం చేయకున్నా వైద్య, ఆర్థిక సహాయాన్ని అందచేసింది. దాదాపుగా అణు యుద్ధం అంచులదాకా వెళ్లిన కొరియా యుద్ధం ఆఖరి నిమిషంలో అణ్వాయుధ ప్రయోగం ఆగిపోయినా ప్రపంచంలోని అతి భయంకరమైన యుద్ధాల్లో ఒకటిగా నిల్చిపోయింది.
ఉత్తర కొరియా మంటు పట్టు, అమెరికా  పట్టుదల వెరసి ఇరు దేశాలు యుద్దనికి సై అంటే సై అంటున్నాయి. ప్రపంచంలో ఇప్పుడు ఉత్తర కొరియాకు ఏకైక మిత్రదేశంగా ఉన్న చైనా కూడా ప్రస్తుత పరిణామాలను జాగ్రత్తగా గమిస్తోంది. యుద్ధం అంటూ మొదలైతే అది ఖచ్చితంగా భీకరంగా ఉండడం ఖాయం. ఉత్తర కొరియా తప్పకుండా దక్షిణ కొరియా పై దాడి చేసి తీరుతుంది. దక్షిణ కొరియాలోని అన్ని ప్రధాన నగరాలను తకగలిగే క్షిపణులు ఉత్తర కొరియా వద్ద చెప్పుకోదక్క స్థాయిలోనే ఉన్నాయి. అమెరికా భూభాగంపై నేరుగా యుద్ధం చేయలేకపోయినా ఉత్తర కొరియా తప్పకుండా దక్షిణ కొరియాను టార్గెట్ చేసి తీరుతుంది. దీనితో అమెరికా ఉత్తర కొరియా పై భారీ ఎత్తున విరుచుకుని పడడం వల్ల ప్రపంచం పటం నుండి ఉత్తర కొరియా తుడిచిపెట్టుకుని పోయే ప్రమాదం లేకపోలేదు. ఈ యుద్ధంవల్ల జరిగే  ప్రాణ నష్టం అంచానాలకు అందనంత ఉంటుందని నిపుణలు విశ్లేషిస్తున్నారు.
కొరియాయుద్ధం జరిగితే ఆ ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద బలంగా పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఆఫ్ఘన్, ఇరాక్ ల యుద్ధం వల్ల భారీగా వనరులు కోల్పోయిన అమెరికా పై కొరియా యుద్ధం మరింత ప్రభావం పడే సూచనలు తప్పుకుండా ఉన్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్తకు జలుబు చేస్తే ప్రపంచానికి తుమ్ములు ఖాయమనే నానుడి ఉండనే ఉంది. ఈ ప్రభావం ప్రపంచమంతా పడే సూచనలు ఉన్నాయి. ప్రపంచ రాజకీయాలపై కూడా కొరియా యుద్ధం పెను ప్రభావం చూపెడుతుంది.
ఇప్పుడైనా ఇరు దేశాలు మంకు పట్టు వీడి ప్రపంచాన్ని మరో సారి యుద్ధ క్షేత్రంలోకి నెట్టవద్దనేది శాంతి కాముకుల కోరిక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *