వారసత్వ ఉద్యోగాలు చెల్లవన్న సుప్రీంకోర్ట్

0
42

సింగరేణి కాలరీస్ లో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్దమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సింగరేణి కాలరీస్ లో ఉద్యోగస్తులు స్వచ్చంధంగా పదవీ విరమణ చేసినా, ఆనారోగ్యంతో ఉద్యోగం మానేసినా వారి స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై కొందరు కోర్టును ఆశ్రయించారు. దీనిపై రాష్ట్ర హై కోర్టు వారసత్వ ఉద్యోగాలు చెల్లవంటూ తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీం కోర్టులోనూ తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చింది. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడం రాజ్యంగ విరుద్దమని స్పష్టం చేసింది.
వారసత్వ ఉద్యోగాల విషయంలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం వారసత్వ ఉద్యోగాలకు ఓకే చేస్తూ జీవోను విడుదల చేసింది. దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించడంతో ఇప్పుడు ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తప్పలేదు. సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here