జూ.ఎన్టీఆర్ పై వదంతులు

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టాడంటూ ఒక అబద్దపు వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రానున్న ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారని దీనికోసం గాను ఒక రాజకీయ పార్టీని కూడా రిజిస్టర్ చేయించారంటూ వస్తున్న వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని తేలిపోయింది. ఒక ఊరు పేరు లేని రాజకీయ పార్టీకి  సంబంధించిన లెటర్ హెడ్ పై జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు ఉన్న ఫొటోతో కూడిన వార్తలో ఎటువంటి వాస్తవ లేదని తేలింది. ఆ లెటర్ లో పేర్కొన్న అడ్రస్ నకిలీదని, అందులో పేర్కొన్న ఫోన్ నెంబర్లు పనిచేయడం లేదని , వెబ్ సైట్ ఓపెన్ కావదడం లేదని ఇది ఎవరో కావాలని సృష్టించిన కల్పిత వార్తేనని సినీ, రాజకీయ  వర్గాలు చెప్తున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జై లవకుశ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారని జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు చెప్తున్నారు.
గతంలో తెలుగుదేశం పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ గత కొద్ది కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీతోనే, బాబాయ్ బాలకృష్ణ తోనూ జూనియర్ ఎన్టీఆర్ కు గ్యాప్ పెరిగిందనే వార్తలు వచ్చినప్పటికీ ఇరువర్గాలు వాటిని తోసిపుచ్చాయి. ఈ క్రమంలో జూనియర్ రాజకీయ పార్టీ వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *