96% మార్కులు వచ్చినా….

0
49
Young student woman alone at desk with computer crying desperate suffering cyber mobbing and bullying

అయిపోయిందిరా… అంతా అయిపోయింది… ఆదివారం ఉదయం 11.00 గంటలకు  మిత్రుడి ఫోన్ … ఏమైందోనని కంగారు పడ్డా… కాస్త స్థిమితపడి చెప్పురా బాబు ఏమైంది అంటూ అడిగేసరికి భోరుమన్నాడు… అదే రా సుశీలా..సుశీలా అంటూ దాదాపు ఏడుస్తున్నాడు.. సుశీల వాడి ఒక్కగానొక్క కూతురు ఏమైందో ఏమో నని చాలా కంగారు పడ్డా.. అప్పుడు చెప్పాడు ఇంటర్ రిజల్స్ వచ్చాయి కదా అని… పోనీలే మహా అయితే ఫెయిల్ అయి ఉంటుంది అంతకన్నా ఏంకాదుగా అనుకుంటూ అయినా ఆ పిల్ల ఫెయిల్ అయ్యే అవకాశమే లేదే.. ఇప్పుడూ పుస్తకాలే లోకంగా  బదుకుతుంది. ఇంటికి వెళ్లిన చిన్ననవ్వునవ్వి తన రూంలోకి వెళ్లి చదువుకుంటూనే ఉంటుంది. టెన్త్ , ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోనూ మంచి మార్కులే వచ్చాయి కదా అనుకుంటూ పోతే పోయింది లేరా మళ్లీ సప్లిమెంటరీ రాసుకోవచ్చు అంటే అప్పుడు చెప్పాడు వాడు లేదురా సుశీ ఫేయిల్ కాలేదు మరీ అంత ఏడుపు ఎందుకురా బాబు అంటే మార్కులు తక్కువ వచ్చాయన్నాడు. సరే పోనీలే అంతే కదా అంటే దానిమీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను అది డాక్టర్ అయితే చూడాలనుకున్నాను ఇప్పుడు చూడు అది ఏం చేసిందో అంటూ గట్టి గట్టిగా హిస్టీరియా వచ్చినవాడిలాగా అరుస్తున్నాడు… పోనీలేరా అదీ కష్టపడి చదివిందిగా దాని ప్రయత్నం అది చేసింది సమాధాన పర్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది నేను చెప్పే మాటలు ఏవీ వాడి చెవికి ఎక్కడం లేదు. తన కూతురు తనను మోసం చేసిందని… సరిగ్గా చదవలేదని… బాగా చదివి ఉంటే తప్పకుండా మంచి మార్కులు  వచ్చేవని… చెప్పుకుంటూ పోతున్నాడు…
దీనికి వచ్చిన మార్కులకు వాళ్ల కాలేజీ ప్రిన్సిపాల్ కూడా బాగా అప్ సెట్ అయ్యాడట. తన మీద ఆయన కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు పాపం అయినా చూడు అది ఎంత పనిచేసిందో అంటూ అరుస్తున్నాడు. సర్లే నేను వస్తానంటూ రెండిళ్ల అవతలే కావడంతో ఫోన్ పెట్టిసిన వెంటనే వాళ్లింటికి పరుగు..పరుగుల వెళ్లాను. వాళ్లింట్లో పరిస్థితి చూస్తే నాకు ఏమీ అర్థం కాలేదు. ఇంట్లో ఏదో అశుభం జరిగినట్టు మా వాడి భార్య వెక్కివెక్కి ఏడుస్తుంటే సుశీల పాపం ఒక మూల బిక్కమొహం వేసుకుని కూర్చుంది. కనీసం దానికి ఏడ్చే అవకాశం కూడా లేకుండా దానిపై విరుచుకుని పడుతున్నారు భార్యాభర్తలు. నన్ను చూసి వాళ్లు మరింత రెచ్చిపోయారు. సుశీలను కొట్టినంత పనిచేశారు. అతి కష్టం మీద వాళ్లను ఆపి అసలు ఎక్కడ మార్కులు తగ్గాయో ఎందు తగ్గాయో కనుక్కునే పనిలో పడ్డాను నేను.  ఇంత సేపు అసలు విషయం కనుక్కోని నేను అసలు  ఎన్ని మార్కులు వచ్చాయని అడిగితే పాపం సుశీల బెరుగ్గా… భయం భయంగా 959 అని చెప్పింది. ఆ అమ్మాయి చెప్పింది నిజమా కాదా అంటూ ఖంగు తింటూనే మళ్లీ అడిగాను.. తను మళ్ళీ 959 మార్కులంటూ చెప్పింది. అంటే 96 శాతం అన్నామాట. దీనికి ఇంత గొడవ ఎందుకో నాకు అర్థం కాలేదు. అప్పుడు రేయ్ దానికి 96 శాతం మార్కులొస్తే ఎందురా ఇంత గొడవ అంటే అప్పుడు చెప్పడం మొదలు పెట్టాడు వాడు.
బోడి 96 పర్సెంట్ దేనికి సరిపోతాయి రా… దాన్ని డాక్టర్ ని చేయాలని ఎన్ని కలలు కన్నాను ఇప్పుడు చూడు దానికి వచ్చిన మార్కులకి డాక్టర్ అవుతుందా…వాళ్ల కాలేజీ ప్రిన్సిపాల్ కూడా చాలా బాధపడ్డాడు అంటూ ఇంకా ఏదో చెప్తున్నాడు కానీ మా బుర్రకి ఏదీ ఎక్కడం లేదు. 96 శాతం అంటే మాటలా… ఆ మార్కులు చాలవా… ఇంకో రెండు పర్సెంట్ తో 98 శాతం రాలేదని ఇంత గోలా… ఎంబీబీఎస్ చదవలేకపోతే బతుకే లేదా… ఏందో నాకేం అర్థం కావడం లేదు అనుకుంటూ అక్కడి నుండి ఇంటి రాగానే మరో చేదు వార్త 94 శాతమే వచ్చిందని నా చుట్టాలబ్బాయి ఆత్మహత్యకు ప్రయత్నం చేశాడట… 92 శాతమే వచ్చిందని ఇంకో అమ్మాయి ఏడుస్తూ కుర్చుందట… అప్పుడే వచ్చాడు మా ఇంట్లో పై ఫోర్షన్ లో ఉండే పిల్లోడు ఈ హడావుడిలో మర్చిపోయాను గానీ వాడు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాశాలు. చేతిలో స్వీట్ డబ్బాతో వచ్చిన వాడు వాళ్ల తల్లి నా చేతిలో స్వీట్ పెడుతో ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాను అంటూ చెప్పాడు. ఇంతకీ ఎన్ని మార్కులు వచ్చాయంటే 61 శాతమట వాడు చాలా ఆనందంగా గంతులేస్తున్నాడు. అప్పుడనిపించింది ఆనందానికి మార్కులకు సంబంధం లేదని……
(కలాన్ని కదిలించండి మీ రచనలు మాకు telanganaheadlines.in కు పంపండి)

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here