‘ఏబీ డివిలియర్స్’ వీరబాదుడుకు పెట్టింది పేరైన ఈ ఆటగాడి ముద్దు పేర్లలో మరొకటి వచ్చి చేరింది. ప్రత్యర్థి బౌలర్ చీల్చి చెండాడే డివిలియర్స్ కు ‘తుఫానీ బ్యాట్స్ మన్’ అంటూ పుణె ఆటగాడు జయదేవ్ ఉనద్కత్ పేరు పెట్టాడు. డివిలియర్స్ బాదాలని నిర్ణయించుకున్నాక ఎంత బాగా బౌలింగ్ వేసినా ప్రయోజనం ఉండదంటూ చెప్పుకొచ్చాడు. ఆనారోగ్యం కారణంగా ఐపిఎల్ లోకి కాస్త ఆలస్యంగా అడుగుపెట్టిన డివిలియర్స్ వచ్చీ రావడంతోనే తన విధ్వంసకర బ్యాటింగ్ తో అదరగొట్టాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో ఆడిన మ్యాచ్ లో బ్యాటింగ్ ప్రతాతం చూపించిన డివిలియర్స్ 46బాల్స్ లో 89 రన్స్ చేశారు.
ఈ భూ ప్రపంచంలోనే డివిలయర్స్ అంతటి విధ్వంసకర, భయంకరమైన క్రికెటర్ ను మరొకరిని చూడలేదని సౌత్ ఆఫ్రికా మాజీ ఫెస్ బౌలర్ అలెన్ డోనాల్డ్ అంటున్నాడు. తాను ఎంతో మంది ఆటగాళ్లను చూశానని కానీ డివిలియర్స్ లాంటి భయంకరమైన ఆటగాడు మరొకడు లేడని డోనాల్డ్ అంటున్నాడు. మిస్టర్ 360, సూపర్ మ్యాన్ ఆఫ్ క్రికెట్, విధ్వంసకర బ్యాట్స్మన్ అంటూ ముద్దుగా పిల్చుకునే డివిలియర్స్ ఖతాలో మరికొన్ని ముద్దు పేర్లు వచ్చి చేరాయి.