కేటీఆర్ ఐస్ క్రీం ధర రు.5లక్షలు

ఒక సగటు ఐస్ క్రీం పార్లర్ సంవత్సర ఆదాయాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఒక్క గంటలోనే ఐస్ క్రీంలు అమ్మి సంపాదించారు. టీఆర్ఎస్ ప్లీనరీ, వరంగల్ సభల కోసం ఖర్చులను రెండు రోజులపాట కూలీ పనిచేసి సంపాదించాలంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరు కేటీఆర్ హైదరాబాద్ సుచిత్ర సర్కిక్ లోని ఒక ఐస్ క్రీం పార్లర్ లో పనిచేశాడు.  ఐస్ క్రీంలను అమ్మడంతో పాటుగా ఫ్రూట్ జ్యూస్ లు తయారు చేసి ఇచ్చారు. దీనికి గాను ఆయనకు 7.30 లక్షలు వచ్చాయి.  ఈ  మొత్తాని పార్టీ ఖర్చులకు ఇవ్వనున్నారు. కేటీఆర్ చేతుల మీదుగా ఇచ్చిన ఐస్ క్రీంకు మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి ఐదు లక్షల రూపాయలు ఇవ్వగా నిజాంపేట మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి లక్ష రూపాయలు ఇచ్చారు. ఫ్రూట్ జ్యూస్ లకు మరో 1.30 లక్షలు వచ్చాయి. మొత్తం మీద కేటీఆర్ ఐస్ క్రీం పార్లర్ లో చేసిన పనికి 7.30లక్షలు వచ్చాయి. కేటీఆర్ అమ్మిన ఐదు లక్షల రూపాయల ఐస్ క్రీం రుచి ఎట్లా ఉందో మరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *