జవాన్లపై దాడులా… సిగ్గు..సిగ్గు..

by:D.V.Sai  Krishna 
అందాల కాశ్మీరం అతలాకుతలం అవుతోంది…ప్రకృతి అందాలకు నెలవైన ఈ భూమి అరాచక శక్తులకు అడ్డాగా మారింది…కాశ్మీర్ లోయలో పరిస్థితి నానాటికీ దిగజారుతోంది… గతంలో ఎన్నడూ లేనంతగా ఇటీవల కాలంలో ఉగ్రవాద మూకలకు స్థానికుల మద్దతు పెరుగుతోంది. గతంలోనూ వేర్పాటువాదులకు కాశ్మీర్ లోయలోని కొన్ని ప్రాంతాలపై గట్టి పట్టున్నప్పటికీ ఈ మధ్య పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యాయి. ఉగ్రవాదులకు మద్దతుగా అక్కడి యువత భారత బలగాలపై దాడులకు తెగబడుతోంది. ఉగ్రవాదులకు అండగా నిలుస్తూ భద్రతా బలగాల కార్యకలాపాలకు విఘాతం కలిగిస్తున్నారు. ఈ పరిణామాలను దేనికి సంకేతంగా భావించాలి. భారత్ పాలకుల పట్ల వ్యతిరేకతా… ప్రభుత్వ ఉదాశీనతా…తీవ్రవాదులు ఎక్కించిన మత మౌఢ్యమా… కాదరణాలు ఏదైనా భారత బలగాలపై దాడులు నిత్య కృత్యం అయ్యాయి. రాళ్లనే ఆయుధాలుగా చేసుకుని మన సైనికులు, పోలీసుల మీద కాశ్మీరీ యువత దాడులు చేస్తుంటే సైన్యం, సీఆర్పీపీఎఫ్, స్థానిక పోలీసు బలగాలు వెనక్కి తిరిగి పారిపోవడం లాంటి ఘటనలు నిజంగానే కలచి వేస్తున్నాయి.
శ్రీనగర్ లోక్ సభ స్థానానికి జరిగిన ఎన్నికల సందర్భంగా సీఆర్పీఎఫ్ బలగాలపై స్థానికులు చేసిన దాడికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అయ్యాయి. భారత వ్యతిరేక నినానాదుల చేస్తూ జవాన్ల పై చేస్తున్న దాడి అక్కడి పరిస్థితులను కళ్లకు  కట్టింది. ఈ వీడియోను చూసిన చాలా మంది తీవ్రంగా స్పందించారు. రాజకీయ వేత్తలు,   క్రికెటర్లు, సెలబ్రీటీలు దీనిపై స్పందిస్తూ భారత జవాన్లు వారికి తగిన బుద్ది చెప్పాల్సిందే అంటున్నారు. ఇదే కాదు గతంలోనూ ఇటువంటి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. రాళ్లతో దాడులు చేస్తున్నా చేతిలో తుపాకీ ఉండి కూడా జవాన్లు వెనుతిరిగి వస్తున్నట్టుగా కనిపిస్తున్న దృశ్యాలు కలవర పెడుతున్నాయి.
చేతిలో ఆయుధం ఉన్నా జవాన్లు ఎందుకు మౌనంగా ఉండిపోయి వాళ్ల దాడులను భరిస్తున్నారు. జవాన్ల చేతులు కట్టెస్తున్నది ఎవరు. నోటికి వచ్చినట్టుతిడుతూ దాడులు చేస్తున్న యువకులను నిలువరించడం భద్రతా దళాలకు చేతకాదా… మరి  వారి మౌనం దేనికి… మానవ హక్కులంటూ రాద్దాతం చేసే పెద్ద మనుషులకు ఈ దృశ్యాలు కనిపించడం లేదా… నరనరానా జీర్ణించుకునిపోయిన మత మౌఢ్యుల మాటలు తలకెక్కించుకుని కాశ్మీరీ యువత చేస్తున్న ఈ చర్యలను ఏమనాలి. వీటిని ఏ  విధంగా చూడాలి.
మన భలగాలపై దాడులు చేస్తూ వాటిని వీడియోలు తీసి తామోదో ఘనకార్యం చేశామంటూ ప్రచారం చేసుకుంటున్న వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. కాశ్మీర్ విషయంలో రాజకీయాలు పక్కనపెట్టి ఇప్పటికైనా పాలకులు చిత్తశుద్దితో చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరం ఉంది. శ్రీనగర్ లోక్ సభకు జరిగిన ఉప ఎన్నికల్లో రెండు శాతానికి మించి ఓట్లు పడలేదంటే దానికి కారణం ఏమిటి… వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం కాశ్మీర్ లో ఖర్చు పెడుతున్నాం  అయినా తిన్నింటి వాసాలు లెక్కపెట్టే ఘనులకు తప్పకుండా గుణపాఠం చెప్పాల్సిందే….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *