అట్లాంటాలో కాల్పులు

అమెరికాలోని అట్లాంటా నగరంలో  కాల్పులు జరిగాయి. నగరంలోని మెట్రో రైల్వే స్టేషన్ లో గుర్తు తెలియని వ్యక్తి విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెస్ట్ లేక్ రైల్వే స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. కాల్పులతో వెస్ట్ లేక్ పోలీస్ స్టేషన్ ను తాత్కాలికంగా మూసివేశారు.   గాయపడ్డ వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిగిన వ్యక్తిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *