బరితెగించిన పాకిస్తాన్

0
47
    భారత మాజీ నేవీ అధికారి, పాకిస్తాన్ కోర్టు మరణ శిక్షవిధించిన కులభూషణ్ వ్యవహారంలో  పాకిస్తాన్ తన మొండి వైఖరిని విడిచిపెట్టడంలేదు  సరికదా తన వాదనను సమర్థించుకుంటోంది.

  • కుల భూషణ్ వ్యవహరంలో ఎటువంటి పరిణామాలనైన ఎదుర్కొనేందుకు సిద్ధమంటూ పాక్ ప్రకటించింది.
  • కులభూషణ్  ను తాము ఇరాన్ నుండి కిడ్నాప్ చేయలేదని తమ భూబాగంలోనే అరెస్టు చేశామని చేస్తూనే సాక్షాలు ఇతర  దేశాలకు చూపించాల్సిన అవసరం లేదంటోంది.
  • కులభూషణ్ వ్యవహారంలో రాజీ ప్రశక్తి లేదని ఆదేశ సైనిక అధికారులు స్పష్టం చేస్తున్నారు.
  • కులభూషణ్ వివాదం నేపధ్యంలో పాకిస్తాన్ ఆర్మీ అధికారుల ఉన్నత స్థాయి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది.
  • పాక్ ఆర్మీకి చెందిన అధికారి ఒకరు నేపాల్ లో గల్లంతయ్యారని ఆయనకు కుల్ భూషణ్ జాదవ్ వ్యవహారానికి సంబంధంలేదంటూ పాక్ కొత్త వాదనకు తెరతీస్తోంది.
  • తమ ఆర్మీ అధికారి విషయంలో భారత్ దూకుడూను ప్రదర్శిస్తే తీవ్ర పరిణామాలుంటాయంటూ భారత్ నే హెచ్చరిస్తూ పాక్ తెంపరితనాన్ని ప్రదర్శిస్తోంది.
  • పాక్ అర్మీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించినట్టు పాక్ మీడియా వెళ్లడించింది.
  • భారత్ హెచ్చరికలకు లొంగకూడదని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here