మహేశ్ బాబు రహూల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రానికి ‘స్పైడర్ ‘ అని పేరు పెట్టారు. మహేశ్ బాబు ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో మహేశ్ బాబు కొత్త లుక్ అభిమానులను అలరిస్తుందనడంలో సందేహం లేదు. చేతిలో తుపాకీ పట్టుకుని ఉన్న మహేశ్ ఫస్ట్ లుక్ అదిరిపోయిందని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రాలనికి మురగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.జె. సూర్య ఈ చిత్రంలో విలన్ పాత్రను పోషిస్తున్నాడు. హరీస్ జయరాజ్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటుగా తమిళంలోనూ నిర్మిస్తున్నారు. వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అని మహేశ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.