అమెరికాపై అణు దాడి చేస్తామంటున్న ఉ.కొరియా

అమెరికాలపై అణు దాడి చేస్తామని ఉత్తర కొరియా హెచ్చరించింది. అమెరికా తమను అనవసరంగా రెచ్చగొడుతోందని పరిస్థితులు ఇదేవిధంగా ఉంటే అమెరికాకు తగిన బుద్ది చెప్తామని ఉత్తర కొరియా తీవ్ర హెచ్చరికలు చేస్తోంది. ఇటీవల ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించడంతో అమెరికా నావికాదళం ఉత్తరకొరియా వైపు మోహరింపులు జరుపుతోంది. దీనిపై తీవ్రంగా మండిపడ్డ ఉత్తర కొరియా అమెరికా చర్యలను తీవ్రంగా ఖండించింది. అమెరికాల చర్యలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని వారు హద్దు మీరి ప్రవర్తిస్తే అణుదాడులకు సైతం వెనుకాడే ప్రశక్తి లేదని ఉత్తర కొరియా తీవ్రంగా హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటివరకు ఐదు సార్లు అణు పరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియా తాజాగా మరోసారి అణు పరీక్షలకు సిద్దమవుతున్నట్టు సమాచారం. దీనితో అమెరికా అప్రమత్తం అయింది. తన నావికా దళాన్ని ఉత్తర కొరియా వైపు మోహరిస్తోంది.
అమెరికా మోహరింపులు, ఉత్తర కొరియా హెచ్చరికలతో ఈ ప్రాంతంలో తీవ్ర ఉధ్రిక్తత నెలకొంది. ఉత్తర కొరియాను నిలువరించడంలో చైనా తమకు సహకరించినా సహకరించకపోయినా తాము ఉత్తర కొరియాను దారిలోకి తీసుకుని వస్తామంటూ అమెరికా తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే తన క్షిపణి, అణు పరీక్షలతో కొరకరాని కొయ్యగా తయారైన ఉత్తర కొరియ తాజా పరిణామాల నేపధ్యంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రపంచం దేశాల ఆంక్షలను ఎదుర్కొంటున్నప్పటికీ మొండిగా వ్యవహరిస్తున్న ఉత్తర కొరియా అమెరికాకు చేసిన హెచ్చరికల నేపధ్యంలో ఉధ్రిక్తలు మరింత పెరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *