మూడవేల మంది ఓటర్లు-కోటిరూపాయల ఖర్చు

అది మూడు వేల ఓటర్లు కూడా లేని చిన్న వార్డు. ఖచ్చితంగా చెప్పాలంటే 2902 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడి వార్డుకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి అక్షరాలా కోటిరూపాయలకు  పైగా చేస్తున్నారట. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది అక్షర సత్యం.కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాల్టీలో వై.ఎస్.ఆర్.  కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యుడు మృతి చెందడంతో ఉప ఎన్నికలు జరగుతున్నాయి. ఈ వార్డు ను గెల్చుకునేందుకు టీడీపీ, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. ఎన్నికను ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ధన ప్రవాహం జరుగుతోంది. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, తేలుగుదేశం నేత  రావి వెంకటేశ్వరరావులు పోటాపోటీగా వ్యక్తిగత ప్రతిష్టకు పోవడంతో చిన్న వార్డుకోసం జరుగుతున్న ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఎవరికి వారు ఎక్కడా తగ్గకపోవడంతో డబ్బు ఏరులై పారుతోంది.
ఈ వార్డును కైవసం చేసుకోవడం ద్వారా కోడాలి నానిని గట్టి దెబ్బకొట్టాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుండగా వార్డును గెల్చుకోవడం ద్వారా తన పంతాన్ని నెగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీదు ఈ ఎన్నికల పోరు స్థానిక ఓటర్లుకు మాత్రం పండుగల మారింది. ఒక వర్గం ఓటుకు 7వేల రూపాయలు ఇస్తుండగా మరో వర్గం 6వేల రూపాయలతో పాటుగా కుంకపు భరిణను పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది.
 
కృష్ణా జిల్లా గుడివాడ పురపాలక సంఘం 19వ వార్డు ఉపఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రధాన పోటీ పార్టీలు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాయి. వైకాపాకు చెందిన వార్డు సభ్యుడు మృతిచెందడంతో ఇక్కడ ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు. తెదేపా నుంచి రావి వెంకటేశ్వరరావు, వైకాపా నుంచి ఎమ్మెల్యే కొడాలి నాని ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని డబ్బులను ఏరులా పారిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఓ వర్గం ఓటుకు రూ.7వేల వరకు ఇస్తుంటే.. మరో వర్గం ఓటుకు రూ.6వేలతో పాటు వెండి కుంకుమ భరిణులు పంపిణీ చేస్తోంది. 2902 ఓట్లు ఉన్న ఈ వార్డులో ఒక్కో అభ్యర్థి రూ.కోటి చొప్పున ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. పోలింగ్‌ కేంద్రం ఎక్కువ మంది ఉండరాదని చెప్పడంతో రావి వెంకటేశ్వరరావు వర్గానికి, పోలీసులకు స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *