భారత్-మంగోలియా సైనిక విన్యాసాలు

దలైలామా భారత పర్యటన సందర్భంగా చైనా నానా రాద్దాంతం చేస్తున్న సమయంలో భారత్-మంగోలియా సైన్యాల ఉమ్మడి విన్యాసాలు ప్రారంభం అయ్యాయి. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై ఇరు సైన్యాలు ఉమ్మడిగా విన్యాసాలు జరుపుతున్నాయి. మంగోలియాలో జరుగుతున్న ఈ సంయుక్త శిక్షణా విన్యాసాల్లో’ కుమావోస్ ‘రెజిమెంట్ కు చెందిన  ఒక ప్లాటూన్ సైనికులు, ఇద్దరు పర్యవేక్షకులు పాల్గొంటున్నారు. ఇరు దేశాలకు చెందిన  సైనికులు సంయుక్తంగా నిర్వహించే శిక్షణ,  విన్యాసాలు 2004లో ప్రారంభమైనా ఈ దఫా జరుగుతున్న విన్యాసాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. గతంలో జరిగిన విన్యాసాలకు భిన్నంగా ఈదఫా ఇరు సైన్యాలు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాయి.
టిబెట్ తరువాత బౌద్దారామాలకు చెందిన అత్యున్నత ఫిఠాలు మంగోలియాలోనే ఉన్నాయి. ఇటీవల దలైలామా మంగోలియా పర్యటన పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన చైనా మంగోలియా పై ఆర్థిక ఆంక్షలు విధించింది. చైనా అంక్షలకు,  బెదిరింపులకు  బెదిరేదిలేదని మంగోలియా  ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఇటీవల కాలంలో చైనా పై ఇంత కఠిన వైఖరిని మంగోలియా ప్రదర్శించలేదు. అటు భారత్ పై ఒంటికాలిపై లేచిన చైనా మంగోలియా పై కూడా తన ప్రతాపాన్ని చూపిన క్రమంలో ఇరు దేశాల సైనికు నిర్వహిస్తున్న సంయుక్త శిక్షణా విన్యాసాలు ప్రాధాన్యం  సంతరించుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *