మంథని ముధుకర్ కేసులో మరో కోణం

0
47

మంథని మధుకర్ అనుమానాస్పద కేసు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపింది. దళితుడైన మంథని ముధుకర్ ను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని దీనికి స్థానిక సీఐ, ఎమ్మెల్యే సహాయసహకారాలు ఉన్నాయంటూ దళిత,  ప్రజా సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. ఇటు విపక్షాలు కూడా ముధకర్ మృతిపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. మధుకర్ అనుమానాస్పద మృతి వ్యవహారం ఇప్పుడు పూర్తిగా రాయకీయ రంగు పులుపుకుంది. అయితే మధుకర్ అనుమానాస్పద మృతి వ్యవహారాన్ని అవసరంగా రాజకీయం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. మధుకర్ ప్రేమ వ్యవహారామే అతని హత్యకు దారితీసిందనేది దళిత సంఘాల వాదన  కాగా అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని మధుకర్ తో పాటుగా అతని ప్రేయసి కూడా ఆత్మహత్యకు ప్రయత్నించిన సంగతిని పట్టించుకోవడం లేదని కొందరంటున్నారు.
స్థానికుల కథనం ప్రకారం మధుకర్ వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఒక యువతి ప్రేమించుకున్నారు. త్వరలో పెళ్లిచేసుకుందామనుకున్నారు. అప్పటికే సదరు యువతికి   పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న అమ్మాయి తల్లిదండ్రులు ఉన్న కాస్త పొలం అమ్మి అమ్మాయి పెళ్లికోసం  సిద్ధపడ్డారు. ఈ క్రమంలో తన ప్రేమ వ్యవహారం తల్లిదండ్రులకు చెప్పాడనికి భయపడిన ఆ అమ్మాయి తనను మర్చిపోవాలని మధుకర్ కు చెప్పిందని అంటున్నారు. యువతి తల్లికి అనారోగ్యంగా ఉండడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకుని వెళ్లిన సమయంలో మధుకర్, యువతి కలుసుకున్నారని కలిసి జీవంచలేమని తెలుసుకుని ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారని వారు చెప్పారు. మధుకర్ ను ప్రేమించిన యువతి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా మధకర్ వీరు ఇరువురు కలుసుకునే ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నాడని వారంటున్నారు. తాను ఆత్మహత్య యత్నం చేసిన విషయాన్ని యువతి తన తండ్రి కి ఫోన్ ద్వారా చెప్పిందని వెంటనే ఇరుగుపొరుగు వారికి ఫోన్ చేసిన యువతి తండ్రి ఆమెను సకాలంలో ఆస్పత్రిలో చేర్పించడంతో ప్రమాదం తప్పిందని అంటున్నారు. తను ప్రమాదం నుండి బయటపడడంతో మధుకర్ కు ఫోన్ చేసిన యువతి ఆతని సోదరుడు ఫోన్ ఎత్తడంతో అతను ఫలానా చోట ఉంటాడనే సమాచారం ఇచ్చిందని అంటున్నారు. యువతిది కూడా చాలా పేద కుటుంబమని ఆమె తండ్రి ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడని అంటున్నారు. మధకర్ ఆత్మహత్య విషయంలో నిజానిజాలు తెలుసుకోకుండా కొందర అనవసర రాద్దాంతం చేస్తున్నారని వారంటున్నారు. మధుకర్ ను హత్య చేసేంత శక్తి యువతి తల్లిదండ్రులకు లేవనేది వారి వాదన.
 
అయితే మంథని మధుకర్ తపున వారు మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. మధుకర్ ను అమ్మాయి తరపువారే హత్యచేశారని వారు ఆరోపిస్తున్నారు. మధుకర్ ఆత్మహత్యకు పాల్పడితే అతని శరీరంపై దెబ్బలు ఎందుకు  ఉంటాయని వారు ప్రశ్నిస్తున్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here