రామమందిరం కోసం దేనికైనా సిద్ధం:ఉమ భారతి

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఏం చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అన్నారు. లక్నోలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ రామమందిరం కోసం ప్రాణ త్యాగానికి సైతం సిద్ధమని అన్నారు. రామమందిరం కోసం జైలుకు వెళ్లడానికి సిద్ధమని ఊరి వేసుకోమన్నా వేసుకుంటానని చెప్పారు. రామమందిర నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రికి రామమందిర నిర్మాణం గురించి ప్రత్యేతంగా చెప్పాల్సిన అవసరం లేదని దీనిపై ఆయనకు పూర్తి అవగాహన ఉందని ఉపమాభారతి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రామమందిర నిర్మాణం ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్నందున దానిపై ఇంకా ఎక్కువ విషయాలు ప్రస్తుతాని మాట్లాడడం లేదన్నారు.
అయోధ్యలో రామమందిర నిర్మాణ అంశం తిరిగి తెరపైకి వచ్చింది. కొంతకాలంపాటు దీనిపై కొంత స్తబ్ధత నెలకొన్నా ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుపొందడంతో పాటుగా  బాబ్రీ మసీదు కూల్చివేత అంశంపై తిరిగి విచారణ  జరపాలని ఇటీవల దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వులోఉంచింది. అయోధ్యలో మసీదు కూల్చివేత కుట్ర కేసులో బీజేపీ సీనియర్ నేతలు అధ్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి సహా  పలువురిపై అభియోగాలను కింది కోర్టు కొట్టివేసిన క్రమంలో వారిపై తిరిగి విచారణ జరపాలంటూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పరిణామాలతో బాబ్రీ మసీదు అంశం తిరిగి తెరపైకి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *