వైభవంగా శోభా యాత్ర

శ్రీరామ నవమి సందర్భంగా పాతనగరం మంగళ్ హాట్ నుండి సుల్తాన్ బజార్ వరకు శోభాయాత్ర వైభవంగా జరుగుతోంది. వేలాది మంది యువకులు కాషాయ జెండాలు చేతబూని జైశ్రీరాం నినాదాలతో హోరెత్తిస్తున్నారు. మంగళ్ హాట్ లో ప్రారంభమైన ఈ యాత్ర మంగళ్ హాట్, ధూల్ పేట్, బేగంబజార్, అప్జల్ గంజ్, పుత్లీబౌలీ ల మీదుగా సుల్తాన్ బజార్ హనుమాన్ వ్యయామశాల వరకు సాగుతోంది. బైక్ లు, లారీలు, కార్లు, ఓపెన్ టాప్ జీప్ లలో యువకులు ఉత్సాహంగా శోభా యాత్రలో పాల్గొంటున్నారు. శోభ యాత్ర ను మంగళ్ హాట్ వద్ద గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రారంభించారు. యాత్రకు స్వాగతం పలికేందుకు స్టేజీలను ఏర్పాటు చేశారు. శోభయాత్ర జరుగుతున్న ప్రాంతంమంతా కాషాయరంగు జెండాలతో రెపరెపలాడుతోంది. వీహెచ్ పీ నేత ప్రవీణ్ భాయ్ తోగాడియాతో పాటుగా కమలానంద భారతి స్వామి లాంటి నేతలు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. యాత్ర పొడవునా మంచినీరు, మజ్జిగ, ప్రసాదం పంపిణీ చేస్తున్నారు.
శోభా యాత్రను పురస్కరించుకుని పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 5వేల మంది సాధారణ పోలీసులతో పాటుగా రాపిడ్ యాక్షన్ బలగాలను కూడా మోహరించారు. సీసీ టీవీలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నగర పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి స్వయంగా భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *