హింధువులపై పిచ్చిరాతలు-చచ్చు వ్యాఖ్యలు

 By:D.V.Sai Krishna
హింధూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు ఈ మధ్యకాలంలో ప్యాషన్ అయిపోయింది. తమని తాము మేధావుగా చిత్రీకరించుకుంటున్న ప్రతీ వాడూ దేవుళ్లపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నార. హింధువుల పండుగలు వచ్చాయంటే చాలు వీరి రాతలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని వీరు రాస్తున్నే రాతలు రోత పుట్టిస్తున్నాయి. తమని తాము అణగారిన వర్గాలకు ప్రతినిధులుగా చెప్పుకుని వీరు చేస్తున్న వ్యాఖ్యలు దారుణంగా ఉంటున్నాయి. శ్రీరామనవమి వేడుకలను దేశవ్యాప్తంగా చేసుకుంటూ ఉంటే కొందరికి మాత్రం రాముడు ఆదర్శ పురుషుడు కాడట. ఎవరి అభిప్రాయాలు వారివి అనుకున్నా సామాజిక మాధ్యమాల్లో ఇటువంటి పోస్టులు పెట్టడం ద్వారా అనేక మంది మనోభావాలను దెబ్బతీసే హక్కు వీరికి ఎక్కడుంది.
రామాయణం గురించి తెలియని, రాముని గొప్పతనాన్ని తెలుసుకోలేని ఈ మందబుద్దులా రాముని గురించి వ్యాఖ్యానించేది. ఒకటి రెండు విషయాలను పట్టుకుని తమకు తోచిన విధంగా వాటికి బాష్యాలు చెప్పే ఈ పెద్దమనుషులకు కనీసం బుద్దీ జ్ఞానం ఉన్నాయా… నిజమే లెండీ బుద్దీ జ్ఞానం ఉన్న వాడెవడీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడు. అణగారిన వర్గాలకు ప్రతినిధులుగా చెప్పుకుంటూ పక్క మతానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేసే వీరు లైకిక వాదులా… హేతువాదులా… హేతువాదం అనేది వారు కప్పుకున్న ముసుగు మాత్రమే ఈ ముసుగులో హింధూ సంస్కృతిపై జరుగుతున్న దాడిని ఖండించి తీరాల్సిందే…శ్రీకృష్ణుడిని ఈవ్ టీచర్ అంటూ ఒక వెధవ కామెంట్ చేస్తే రాముడు భార్యను హింసించాడని ఇంకొకడు వాగుతాడు. నిజంగా పురాణాలను గురించి తెలుసుకున్న వాడు వాటి గొప్పతాన్ని అర్థం చేసుకున్న వాడు ఎవడూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడు. మిడిమిడిజ్ఞానంతో మిడిసిపోయి వీళ్ల చేతికి ఇప్పుడు ఫేస్ బుక్, వాట్సప్ లాంటివి చేరాయి. తమ పిచ్చి రాతలు, అర్థం లేని వ్యాఖ్యలతో ప్రజలను రెచ్చగొడుతున్న వారికి తగిన బుద్ది చెప్పాల్సిందే.
అడ్డగోలు రాతలు రాసే బుద్దిలేని జీవులకు కేవలం హింధూ మతం మాత్రమే కనిపిస్తుంది. ఇతర మతాలను అనే దమ్ము ధైర్యం ఉండదు. అవునులే ఎమైనా పడేది వారేగా… హింధువులు తిరగబడితే మళ్లీ అసహనం అంటూ నోళ్లు తెరుచుకుని మీద పడే కుహానా మేధావుల్లారా ఇప్పటికైనా మీ పిచ్చిరాతలు, చచ్చు వ్యాఖ్యలు కట్టిపెట్టంది.
(తెలంగాణ హెడ్ లైన్స్ మీ రచనలకు ఆహ్వానం పలుకుతోంది. మీరు మీ రచనలను telanganaheadlines@gmail.com కు పంపవచ్చు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *