నగరంలో చిరుజల్లులు

హైదరాబాద్ లోని పలు చోట్ల వర్షం పడింది. బలమైన ఈదురు గాలులు,  ఉరుములు, మెరుపులకు తోడు కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు కూడా పడ్డాయి. నగరంలోని  ఎల్.బి.నగర్, దిల్ షుఖ్ నగర్, ఉప్పల్, తార్నాకా,  కూకట్‌పల్లి, బాలానగర్‌, మాదాపూర్‌, సనత్‌నగర్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్ లలో వర్షం కురిసింది. ఎండ వేడికి అల్లాడుతున్న జనం సాయంత్రం కురిసిన జల్లులకు సేదతీరారు. ఈదురు గాలులకు కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడి స్వల్పంగా కరెంటుకు అంతరాయం ఏర్పడింది.
మండు వేసవిలో పడిన చిరుజల్లులతో వాతావరణం ఆహ్లాదంగా మారింది. కొన్ని చోట్ల ఈదురు గాలులు వీచినప్పటికీ చాలా ప్రాంతాల్లో వాతావరణం చల్లగా మారింది. చిరు జల్లులు కురవడంతో మండు వేసవిలో వాన చినుకులు ఉల్లాసాన్ని కలిగించాయి. గత మూడు రోజులుగా ఎండ తీవ్రతతో పాటుగా ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. అయితే చిరుజల్లులు పడిన  తరవాత ఎండలు ఎక్కువ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *