నటి రాఖీసావంత్ అరెస్ట్

సినీ, టీవీ నటి రాఖీసావంత్ ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. రామాయణ మహా కావ్యాన్ని రచించిన వాల్మీకి పై ఆమె ఒక టీవీ షోలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం, దానిపై కొందరు కోర్టును ఆశ్రయిచండంతో కోర్టు రాఖీ సావంత్ కు సమన్లు జారీ చేసింది. సమన్లు వచ్చినప్పటికీ కోర్టుకు హాజరు కాకపోవడంతో రాఖీ సావంత్ పై పంజాబ్ లోని లూథియానా కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేయడంతో పోలీసులు ఆమెను  ను అరెస్టు  చేశారు. తన నోటి దురుసుతో నిత్యం వార్తల్లో ఉండే రాఖీ సావంత్ వాల్మీకిపై చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయంటూ వాల్మీకి బోయ కులస్తులు లూధియానా కోర్టులో కేసు వేశారు.
ప్రస్తుత ఈ వివాదానికి చాలా పెద్ద కథే ఉంది  ప్రముఖ పంజాబీ గాయకుడు మిక్కాసింగ్ పుట్టినరోజు సందర్భంగా తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ రాఖీ చేసిన ఫిర్యాదుతో మిక్కా జైలుకు పోవాల్సి వచ్చంది. ఈ వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవాలంటూ బాలీవుడ్ లోని ప్రముఖులు చేసిన ప్రయత్నాలు సఫలం కావడంతో రాఖీ కేసును వాపస్ తీసుకుంది. ఈ సందర్భంలో రాఖీ సావంత్ ఒక టీవీ షో లో మాట్లాడుతూ మిక్కాపై తాను కేసు వాపస్ తీసుకోవడాన్ని ప్రస్తావిస్తూ మిక్కాసింగ్ మంచివాడిగా మారాడని అంటూ వాల్మీకిని ప్రస్తావించింది. వాల్మీకిని ప్రస్తావించిన తీరుపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలపై కొందరు కోర్టును ఆశ్రయించారు. చివరికి రాఖీ సావంత్ తాను ఉద్దేశపూర్వకంగా అటువంటి వ్యాఖ్యలు చేయలేదంటూ వివరణ ఇచ్చినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. రకరకాల మలుపులు తిరిగిన ఈ కేసు చివరకు రాఖీసావంత్ అరెస్టుకు దారితీసింది.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *