గ్రెనెడ్ లతో ఎయిర్ పోర్టులోకి జవాన్

అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుండే శ్రీనగర్ ఎయిర్ పోర్టులో ఒక ఆర్మీ జవాను బ్యాగులో రెండు గ్రెనెడ్లు దొరకడం సంచలనం రేపుతోంది. సరిహద్దుల్లోని యూరీ నియంత్రణ రేఖ వద్ద పనిచేసే ఈ ఆర్మీ జవాను రెండు గ్రెనెడ్లను బ్యాగులో పెట్టుకుని విమానం ఎక్కబోగా భద్రతా దళాలు అతన్ని అదుపులోకి తీసుకున్నాయి. ఈ జవాను ఒక ఛార్టెడ్ విమానం ఎక్కబోతుండగా అతని వద్ద నుండి గ్రెనెడ్లను స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దుల్లోని అత్యంత కీలకమైన ప్రాంతాల్లో యూరీ ఒకటి. అక్కడ విధులు నిర్వహించే భూపాల్ ముఖియా ఆర్మీ మేజర్ అదేశాల ప్రకారం గ్రెనెడ్ లను ఢిల్లీకి తరలించే ప్రయత్నం చేసినట్టు చెప్పాడు. మేజర్ ఆదేశాల మేరకే తాను గ్రెనెడ్లు తీసుకుని వెళ్తున్నట్టు పోలీసు విచారణలో చెప్పడం మరింత సంచలనం రేపుతోంది. అయితే ఆతను చెప్పిన మాటలను పూర్తిగా విశ్వసించడం లేదని అన్ని కోణాల్లో విచారణ  నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
గ్రెనెడ్ లతో పట్టుబడ్డ ఆర్మీ జావన్ ను స్థానిక పోలీసులతో పాటుగా సీఆర్పీఎఫ్ అధికారులు సంయక్తంగా విచారిస్తున్నారు. గ్రెనెడ్లను ఢిల్లీకి తీసుకుని వెళ్లాలని తన మేజర్ ఆదేశించాడాని ఢిల్లీలో ఒక వ్యక్తి వచ్చి వాటిని తీసుకుంటాడని తన చెప్పాడని అంటున్న జవాన్ ఆయన అదేశాల మేరకే వీటిని తీసుకుని వెళ్తున్నట్టు చెప్తున్నాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే శ్రీనగర్ ఎయిర్ పోర్టులో సైనిక జవాన్లకు మాత్రం ఎటువంటి తనిఖీలు ఉండవు. వారిని సాధారణంగా తనిఖీ చేయరు. అయితే అరెస్టయిన జవాన్ కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు అతని బ్యాగును సోదా చేయగా గ్రెనెడ్లు లభించాయి. ఈ గ్రెనెడ్లు ఎక్కడి నుండి అతనికి చేరాయి అనేది దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రధాని జమ్ము కాశ్మీర్ పర్యటన ముగిసిన వెంటనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో అన్ని అంశాలను దర్యాప్తు చేస్తామని అధికారులు చెప్తున్నారు. యూరీ లోని 17 జేఏకే రైఫిల్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న డార్జిలింగ్ కు చెందిన భూపాల్ వద్దకు వచ్చిన గ్రెనెడ్లు ఎక్కడివి అనేది తేలాల్సి ఉంది. తీవ్రవాదులు డాడిలో 14 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన యూరీలో విధులు నిర్వహిస్తున్న భూపాల్ కు ఎవరితో సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని ఆరాతీస్తున్నారు.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *