చైనాను హెచ్చరించిన భారత్

0
49

తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలని భారత్  చైనాకు గట్టిగా చెప్పింది. బౌద్ధ గురువు తలైలామా భారత పర్యటన సందర్బంగా అరుణాచల్ ప్రదేశ్ ను సందర్శించడంపై చైనా అభ్యంతరాలను భారత్ తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలను తమవి చెప్తున్న చైనా ఆ ప్రాంతాల్లో దలైలామ పర్యటనపై అభ్యతరం వ్యక్తం చేస్తూ భారత్ కు హెచ్చరికలు జారీ చేసింది. లామా పర్యటన వల్ల రెండు దేశాల సంబంధాలు దెబ్బతింటాయంటూ చైనా చెసిన ప్రకటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. చైనా అంతర్గత వ్యవహారాల్లో భారత్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని అదే విధంగా చైనా కూడా భారత్ అంతర్గత వివషాల్లో జోక్యం చేసుకోవడం ఆపాలంటూ గట్టిగానే హెచ్చరించింది.
ఆరుణాచల్ ప్రదేశ్ పూర్తిగా భారతదేశంలో అంతర్భాగమని దీనిపై చైనా చేస్తున్న వాదనల్లో పస లేదని భారత్ పేర్కొంది. దలైలామ ప్రర్యటనపై చైనా అనవసర రాద్దాంతం చేస్తోందని, ప్రజల కోరిక మేరకే దలైలామా అరుణాచల్ ప్రదేశ్ ప్రయటిస్తున్నారని భారత్ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో  చైనా ఎటువంటి హెచ్చరికలు చేసినా సహించేదిలేదని  భారత్ తేల్చిచెప్పింది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here