అగ్రరాజ్యం అమెరికాను వణింకించిన 9/11 దాడులకు సంబంధించిన పొన్ని ఫొటోలను ఆదేశపు దర్యాప్తు సంస్థ ఎఫ్ బీ ఐ ప్రజలకు అందుబాటులో ఉంచింది. 2011 సెప్టెంబర్ 11న జరిగిన ఈ భయానక దాడికి సంబంధించిన ఫొటోలను విడుదల చేసింది. నాలుగు విమానాలను హైజాక్ చేసి వాటిని పేల్చివేయడం ద్వారా అల్ ఖైదా మారణహోమం సృష్టించింది. న్యూయార్క్ లోని ట్విన్ టవర్స్ ను కూల్చివేసిన ఘటనలో 3వేల మందికి పైగా మరణించగా అమెరికన్ రక్షణ కార్యాలయం పెంటాగన్ ను పై కూడా విమానం కూల్చివేసిన ఘటనలో 129 మంది మరణించారు. విమానంలోని 64 మంది ప్రయాణికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. పెంటాగన్ కు సంబంధించిన 27 ఫొటోలను పెంటాగన్ తాజాగా విడుదల చేసింది.