కుతుబ్ షాహీ టూంబ్స్ వద్ద దొరికిన లక్ష కోట్ల ఖజానా

కుతుబ్ షాషీ టుంబ్స్ వద్ద జరుగుతున్న తవ్వకాల్లో భారీ ఖజానా లభించింది. ఈ నిధి విలువ లక్ష కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. గత కొద్ది కాలంగా కుతుబ్ షాహీ టూంబ్స్ వద్ద తవ్వకాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. శనివారం కూడా తవ్వకాలు సాగిస్తున్న వారికి ఒక ఇనుప వస్తువు కనిపించింది. చాలా బరువు ఉన్న దాన్ని అతి కష్టంమీద వెలికితీయగా దాన్ని పెద్ద భోషాణంగా గా గుర్తించారు. పెద్ద పెద్ద తాళాలతో ఇప్పటికీ దృఢంగా ఉన్న ఈ పెట్టెను వెలికి తీయగా  ఉందులో పెద్ద ఎత్తున వజ్రాలు, వైఢూర్యాలతో పాటుగా ముత్యాలు, పెంపులు, రత్నాలు బయటపడ్డాయి. పెట్టె అడుగు భాగంంలో పెద్ద మొత్తంలో బంగారం లభించింది. గోల్గొండ నవాబుల కాలంనాటి ఈ ఖజానా విలువల లక్ష కోట్ల వరకు ఉంటుందని చెప్తున్నారు. ఖజానాతో పాటుగా ఉర్థులో రాసి ఉన్న ఒక లేఖ కూడా ఈ పెట్టెలో లభించింది. దీని ప్రకారం హైదరాబాద్ లో వివాసం ఉంటున్న వారందరికీ ఈ ఖజానా చెందేలా వీలునామా కూడా ఉందని అధికారులు చెప్తున్నారు….సో వెంటనే వేెళ్లి మీ వాటా తెచ్చుకోండి….. పదండి త్వరగా వెళ్లండి అవకాశం ఈ ఒక్కరోజు (ఎప్రిల్ ఫస్ట్ 1న మాత్రమే)…………………….
(నోట్ ఇది ఎప్రిల్ ఫూల్ వార్త నమ్మకండి) ఇది సరదా కోసం రాసిన వార్త మాత్రమే దయచేసి గమనించగలరు ఇందులో ఎటువంటి వాస్తవం లేదు…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *