జిరో బ్యాలెన్స్ జీరో ఛార్జ్ కోటక్ సంచలనం

కోటక్ మహీంద్రా బ్యాంక్ సంచలన నిర్ణయం తీసుకుంది. జీరో బార్జ్, జిరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాలను అందించనున్నట్టు ఆ బ్యాంకు ప్రకటించింది. అన్ని బ్యాంకులు మినిమం బ్యాలెన్స్, సర్వీస్ ఛార్జీల పేరుతో ఖాతాదారుల ముక్కుపిండి వసూలు చేస్తున్న సమయంలో కోటక్ మహీంద్రా తీసుకున్న నిర్ణయం సంచలనం రేపుతోంది. భారీగా ఖాతాదారులను పెంచుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకున్న ఈ బ్యాంకు  అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. 18 నెలల్లో 1.6 కోట్ల మంది ఖాతాదారులను చేర్చుకోవాలని లక్ష్యాంగా పెట్టుకుని కోటక్ అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్యాంకు వైస్ చైర్మన్ ఉదయ్ కోటక్ తెలిపారు. ఈ సరికొత్త పథకానికి ‘811’ అని పేరు పెట్టినట్టు తెలిపారు. తమ ఖాతాదారులతో 6 శాతం వడ్డీని అందచేస్తామని ఆయన చెప్పారు. ఆధార్, ప్యాన్ కార్డులను తీసుకుని వచ్చి ఐదు నిమిషాల్లో ఖాతను తెరవవచ్చని ఆయన వివరించారు. కోటల్ మహీంద్రా బ్యాంక్ యాక్సెస్ బ్యాంకును తనలో విలీనం చేసుకుంటుందనే వార్తలను ఖండించిన ఆయన బ్యాంకు విస్తరణపై దృష్టిపెట్టినట్టు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *