డబుల్ బెడ్ రూం లబ్దిదారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మాట్లాడడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం పథకం లబ్దిదారులతో ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ చేసి ఇళ్లు ఎట్లా ఉన్నాయి, సౌకర్యంగానే ఉందా అంటూ ఆరాతీశారు. ఖమ్మం జిల్లా మద్దులపల్లికి చెందిన లబ్ధిదారు నాగమణి అనే మహిళకు కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. ఇల్లు ఎట్లా ఉందంటూ ప్రశ్నించారు. దీనితో ఆ మహిళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముఖ్యమంత్రి రుణం తీర్చుకోలేనిదని డబుల్ బెడ్ రూం ఇళ్లు చాలా సౌకర్యంగా ఉన్నాయంటూ సీఎంకు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు అన్నివిధాలుగా సౌకర్యవంతంగా ఉందని చెప్పారు. సొంత ఇంటి కల నెరవేర్చిన సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు.