పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం విషవాయువులు పీల్చి ఐదుగురు కార్మికులు మరణించిన ఘటన జిల్లాలోని మొగల్తూరులో జరిగింది. ఆక్వా ప్రాసెసింగ్ పరిశ్రమలో జరిగిన ఈ విషాధ ఘటనపై స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం పరిశ్రమలో రసాయనాల ట్యాంకులు ఉన్నాయి. వాటిని శుభ్రం చేయడానికి ట్యాంకుల్లోకి ఐదురుగురు కార్మికులు దిగారు. రసాయనికి ట్యాంకుల్లో విషవాయువులు నిండి ఉండడంతో వెంటనే కార్మికులు అపస్మార స్థితికి చేరుకున్నారు. తోటి కార్మికులు వారిని బయటకు తీసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈగ ఏడుకొండలు, నల్లం ఏడుకొండలు, బొడ్డు రాంబాబు, తోట శ్రీను, జక్కంశెట్టి ప్రవీణ్‌లు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. నాలుగు మృతదేహాలను వెలికితీయగా మరో మృతదేహాన్ని బయటకు తీయాల్సి ఉంది. కార్మికులు విషవాయువుల కారణంగా మరణించారని అంటుండంగా విద్యుత్ షాక్ వల్ల కార్మికులు ప్రాణాలు కోల్పోయారని మరికొందరు అంటున్నారు. ప్రమాదానికి గల కారణాల పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.