ఈ అందాల లేడి-మహా కిలాడి

hqdefault nayeem1
పేరు: సంగీత చటర్జీ, వయస్సు:26, వృత్తి: ఎయిర్ హోస్టెస్, ప్రవృత్తి: ఎర్రచందనం స్మగ్లింగ్… చిన్న వయసులోనే ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఆరితేరిపోయి కోట్లాది రూపాయలు పోగేసుకుని పోలీసుల కళ్లుకప్పి తిరిగుతున్న ఘరానా లేడీని ఎట్టకేలకు చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. మహిళా స్మగ్లర్ గా పేరుగాంచిన 26 సంవత్సరాల  సంగీత చటర్జీ  ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఆరితేరిపోయింది. పోలీసులకు దొరక్కుండా వాళ్లను మప్పతిప్పలు పెట్టిన ఈ లేడీ స్మగ్లర్ ను ఎట్టకేలకు చిత్తూరు పోలీసులు కోల్ కతాలో అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మణ్ తో పరిచయం ద్వారా ఈమె కూడా ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేయడం ప్రారంభించింది. ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం కన్నా ఈ వ్యాపారమే లాభసాటిగా మారడంతో పెద్ద ఎత్తున స్మగ్లింగ్ కు పాల్పడడంతో పాటుగా హవాలా మార్గాల్లో కోట్లాది రూపాయల నగదు మార్పిడి చేస్తూ అక్రమాల్లో ఆరితేరిన ఈమెను పట్టుకునేందుకు గతంలో పోలీసులు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని తప్పించుకుని తిరిగుతున్న కీలాడీ లేడీని చిత్తూరు పోలీసులు నిఘా పెట్టి బలమైన సాక్ష్యాలను సేకరించి అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మణ్ తో సన్నిహితంగా మెలిగిన ఈ భామ ఆటు తర్వాత అక్రమ సంపాదనవైపు తన దృష్టిని పెట్టిన భారీగా డబ్బును సంపాదించింది.
కోల్ కతా లోని ఆమె నివాసం పై దాడి చేసిన పోలీసులకు పెద్ద మొత్తంలో విలువైన పత్రాలు లభించాయి. వీటితో పాటుగా నకిలీ తుపాకీ లైసెన్సులు లభించాయి. వీటిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సంగీత  పేరన ఉన్న బ్యాంకు లాకర్లను తెరిస్తే మరింత విలువైన సమాచారం తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *