భారత యువకులకు పాకిస్థానీ క్షమాభిక్ష

తన కొడుకును హత్య చేసిన 10 మంది భారతీయులకు క్షమాభిక్ష పెట్టాడో పాకిస్థానీ తండ్రి.  ‘దురదృష్టవశాత్తు నా కొడుకును కోల్పోయాను. ఈ యువకులను నేను క్షమిస్తున్నాను. నిజంగా చెప్పాలంటే అల్లానే వారికి ప్రాణాలను కాపాడాడు. యువత గొడవలకు పాల్పడి ప్రాణాలు తీయొద్దని అర్థిస్తున్నా’ అన్నాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే 2015 డిసెంబర్ ప్రాంతంలో మహ్మద్ ఫర్హాన్ అనే వ్యక్తిని దుబాయ్ లో  కొంత మంది భారత్ యువకులు హత్య చేశారు. హత్యకు కారకులుగా 11 మందిని గుర్తించిన దుబాయ్ కోర్టు వీరిలో 10 మందికి మరణ శిక్ష విధించింది. వీరంతా భారత్ లోని పంజాబ్ ప్రాంతానికి చెందిన వారు. అత్యంత పేద కుటుంబాలకు చెందిన వీరు క్షణికావేశంలో చేసిన హత్యకు మరణశిక్షకు గురికావడంతో హతుడి బంధువులను ఆశ్రయించిందో స్వచ్చంధ సంస్థ. యూఓఈ చట్టం ప్రకారం హతుడి కుటుంబీకులు హంతకులకు క్షమా భిక్ష పెడితే వారు మరణ శిక్ష నుండి బయటపడవచ్చు.  దీంతో దోషులను క్షమించేందుకు ఫర్హాన్‌ తండ్రి రియాజ్‌ ముందుకొచ్చారు.రియాజ్‌ క్షమాభిక్షకు ఒప్పుకోవడంతో షరియా చట్టం ప్రకారం.. నిందితుల తరఫున 2లక్షల దిర్హామ్‌ల నగదును కోర్టుకు అందజేసింది సదరు సంస్థ.దీనితో వారి శిక్ష ఖచ్చితంగా తగ్గుతుందని భారత రాయబారి కార్యాలయం అధికారి ఒకరు చెప్పారు.
ఇదికూడా చదవండి:
http://telanganaheadlines.in/2017/03/27/3339-bandla-ganesh/
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *