ధర్మశాలలో భారత్-ఆస్ట్రేలియా ల మధ్య టెస్టు మ్యాచ్ లో భారత్ పట్టు బిగించింది. 106 పరుగుల స్వల్ప లక్షంతో బరిలోకి దిగిన భారత్ ఆటముగిసే సమయానికి వికెట్లేవీ కోల్పోకుండా 19 పరుగులు చేసింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత్ ఈ మ్యాచ్ తో పాటుగా సిరీస్ ని కూడా గెల్చుకోవడం తధ్యం. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 332 పరుగులకు ఆలౌట్ కావడంతో తొలి ఇన్నింగ్స్ లో 32 పరుగుల స్వల్ప ఆదిక్యం లభించింది. అయితే ఆసిస్ రెండో ఇన్నింగ్స్ లో కేవలం 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఉమేశ్ యాదవ్, రవీంద్ర జడేజా, అశ్విన్ లు తలో మూడు వికెట్లు సాధించగా, భువనేశ్వర్ కుమార్ కు వికెట్ దక్కింది. భారత బౌలర్ల ధాటికి ఆసిస్ కుప్పకూలింది. కీలక ఆటగాళ్లు అందరూ తక్కువ స్కోర్ కే పెవిలీయన్ కు చేరుకోవడంతో ఆసిస్ ఏ దశలోనూ ప్రతిఘటించలేకపోయింది. దీనితో భారత్ 106 పరుగుల స్వల్ప లక్షంతో బ్యాటింగ్ ను ప్రారంభించింది. ఈ మ్యాచ్ లో భారత్ గెలుపు దాదాపుగా ఖాయంగా చెప్పుకోవచ్చు.
ఇది కూడా చదవండి
http://telanganaheadlines.in/2017/03/27/3321-ts-cm-and-ap-cm/