ఎస్.బీ.ఐ లో పదిశాతం ఉద్యోగుల పై వేటు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగులను ఇంటికి పంపే ప్రక్రియను మొదలు పెట్టింది. అనుబంధ బ్యాంకులను తనలో విలీనం చేసుకుంటున్న ఎస్.బీ.ఐలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించనున్నారు. 2019 నాటికి సంస్థలో కనీసం పదిశాతం ఉద్యోగులను తొలగించనున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగులపై వేటు పడుతుండడంతో ఎస్.బీ.ఐ ఉద్యోగుల్లో కలకలం మొదలైంది. పది శాతం ఉద్యోగులను తొలగించడం అంటే చిన్న విషయం కాదని బ్యాంకు ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ఉద్యోగాల తొలగింపు ఖాయం అయిపోయింది. ఈ విషయాన్ని ఎస్.బీ.ఐ ఎండీ రాజనీశ్ స్వయంగా వెల్లడించారు. ఎస్.బీ.ఐలో అనుబంధ సంస్థల విలీనం వల్ల వచ్చే సమస్యలను అధికమించడానికి ఉద్యోగుల తొలగింపు అనివార్యం అయిందని ఆయన చెప్తున్నారు. అయితే ఉద్యోగుల తొలగింపు పై ఇంకా విధివిధానాలు ఖరారు రాలేదన్నారు. ఎవరిని తొలగిస్తారు, ఏ ప్రాతిపదికను ఉద్యోగులపై వేటు ఉంటుంది అనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.
మరో వైపు ఉద్యోగుల తొలగింపు పై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. విలీనం వల్ల సమస్యలు వస్తున్నాయంటూ ఉద్యోగులను బలిచేయడం సమంజసం కాదని అంటున్నాయి. ఉద్యోగాల తొలగింపుకు సంబంధించి విధివిధానాలు ఖరారు అయిన తరువాత తమ కార్యాచరణను ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *