జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో కరగడుగట్టిన హిజబుల్ కమాండర్ తో పాటుగా మరో తీవ్రవాది హతమయ్యాడు. పద్గంపురా వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న భద్రతా బలగాలు ఈ తీవ్రవాదులను మట్టుపెట్టాయి. స్థానికంగా తనిఖీలు నిర్వహిస్తున్న రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన బెటాలియన్ తీవ్రవాదులు ప్రయాణిస్తున్న కారును ఆపారు. కారును తనిఖీ చేస్తుండగా అందులో ఉన్న తీవ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. వెంటనే తేరుకున్న భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో హిజబుల్ కమాండ్ తో పాటుగా మరో తీవ్రవాది హతమయ్యాడు. మరో తీవ్రవాది తప్పించుకుని పారిపోయాడు. చనిపోయింది హిజ్బుల్ లో కమాండర్ స్థాయి తీవ్రవాదిగా గుర్తించారు. తప్పించుకుని పారిపోయిన మరో తీవ్రవాది కోసం భద్రతా దళాలు గాలింపు జరుపుతున్నాయి.