యాదాద్రి, వేములవాడ దేవాలయాల అభివృద్ది పనులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. ఇప్పటి వరకు జరిగిన పనులను ఇంకా ఎంత మేరకు పనులు జరగాల్సి ఉందన్న విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రెండు దేవాలయా అభివృద్ది పనుల్లో ఏమాత్రం అలక్షం వద్దని పనులను తొందరగా పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. దేవాలయ అభివృద్ది పనుల్లో ఆధ్యత్మికతకు, భక్తుల సౌకర్యాలకు పెద్ద పీట వేయాలని సీఎం సూచించారు. ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతిని తెలుసుకున్న కేసీఆర్ పనుల్లో మరింత వేగం పెంచాలన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.