ఎయిర్ ఇండియా సీనియర్ ఉద్యోగిని చెప్పుతో కొట్టి విమర్శలను ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ రవీంద్ర గౌక్వాడ్ ఇప్పటికీ వెనక్కి తగ్గేది లేదని అంటున్నాడు. తనపై విమానయాన సంస్థలు విషేధం విధించన తరువాత కూడా ఆయన తాను చేసిన పనని సమర్థించుకుంటున్నాడు. ఎయిర్ ఇండియా సంస్థ ఆయన రిటర్న టికెట్ ను రద్దు చేయగా ఇండిగో విమానంలో టికెట్ ను కొనుగోలు చేసిన రవీంద్ర గైక్వాడ్ టికెట్ ను ఇండిగో సంస్థ కూడా రద్దు చేసింది. దీనితో ఆ రెండు సంస్థలపై చర్యలు తీసుకుంటానని వాటిపై కోర్టులో తేల్చుకుంటానని గైక్వాడ్ హూంకరిస్తున్నాడు. తనను విమానం ఎక్కనీయకుండా అడ్డుకున్న సంస్థలపై కోర్టు వెళ్తానని అంటున్నాడు. ఈ విషయంలో వెనక్కితగ్గేది లేదని గైక్వాడ్ అంటున్నాడు.
please lieke this page: www.facebook.com/telangana.headlines