కడుపులో పెరిగిన పుట్టగొడుగులు

మీరు పుట్టగొడుగులను తింటున్నారా… అయితే జాగ్రత్త వాటిని సరిగా శుభ్రం చేయకుండా తిన్నా…సరిగా నమలకుండా తిన్నా… తిప్పలు తప్పవు. పుట్టగొడులను శుభ్రం చేయకుండా తిన్న ఒక మహిళ కడుపులో ఏకంగా ఏడు సెంటీమీటర్ల పుట్టగొడుగులు పెరిగాయి. చైనాకి చెందిన 50 ఏళ్ల మహిళ కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లింది అక్కడి డాక్టర్లు ఎక్స్ రే తీయగా కడుపులో పెరుగుతున్న పుట్టగొడుగులను గుర్తించి ఖంగుతిన్నారు. దీనితో ఆ మహిళకు ఆపరేషన్ చేసి పుట్టగొడుగులను తొలగించారు.  పుట్టగొడుగులను సరిగా తినకపోతే ఇటువంటి సమస్యలే వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు. పుట్టగొడుగులు ఎప్పుడు తిన్నా సరైన జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు చెప్తున్నారు. పుట్టగొడుగులు ఎక్కడైనా పెరుగుతాయని కనుక జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు అంటున్నారు.