టీఆర్ఎస్ పార్టీ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ కసరత్తు చేస్తోంది. వరంగల్ లో ఏప్రిల్ 27న జరిగే ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున జన సమీకరణకు ఆ పార్టీ నేతలు కసరత్తులు చేస్తున్నారు. టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ ను 14న విడుదల చేస్తారు. 21న అవసరం అయితే ఎన్నిక జరుగుతుంది. అయితే ఈ ఎన్నిక లాంఛనమే. టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయించారు. ప్రతీ కమిటీలో ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ, బీసీలకు చోటు కల్పించాలని అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆషామాఫీగా తీసుకోవద్దని పార్టీ నేతలకు సూచించారు. ఏప్రిల్ 5వ తేదీ లోగా సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి కానుంది.