గ్రేటర్ హైదరాబాద్ లోని బ్రాహ్మణ యువత కోసం ప్రత్యేక జాబ్ మోళాను నిర్వహిస్తున్నట్టు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన కేవీ రమణాచారి తెలిపారు. ఆదివారం మార్చి 26న నిర్వహించే జాబ్ మేళాలో 30 ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయని ఆయన తెలిపారు. ఈ జాబ్ మేళాలో పాల్గొన దల్చుకున్న వారు WWW.JOBMELA.ONLINE/ TBSP/R-EGISTRATION ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్ లైన్ లో కాకుండా నేరుగా కూడా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని ఆయన వెళ్లడించారు. యూసఫ్ గుడూ, కృష్ణానగర్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌లో ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ జాబ్ మేళా జరుగుతుందని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బ్రాహ్మణులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రమణా చారి కోరారు. తొందరలో 31 జిల్లాల్లో జాబ్‌మేళాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు.