పవన్ కళ్యాణ్ నటించిన ‘ కాటమరాయుడు’ చిత్రంలో హీరోయిన శృతిహాసన్ వయసు కన్నా చాలా పెద్దదిగా కనిపించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో శృతిహాసన్ ను సరిగా చూపించలేదని ఆమె అందంగా కనిపించలేదని సినివర్గాలు విమర్శిస్తున్నాయి. అటు రొమాంటిక్ సీన్లలోనూ ఆమె గ్లామర్ గా కనిపించలేదని అంటున్నారు. పాటల్లో కూడా శృతిహాసన్ బాలేదనే విమర్శలు వస్తున్నాయి. శృతీ హాసన్ అందంగా కనిపించకపోవడానికి ఆమె వేసుకున్న దుస్తులే కారమమని విమర్శిస్తున్నారు. గబ్బర్ సింగ్ సినిమాలా పవన్ పక్కన ఎంతో అందంగా కనిపించిన ఈ భామ కాటమరాయుడులో మాత్రం అసలు సరిగా లేదని ఈ సినిమాకి ఇదే పెద్ద మైనస్ అంటున్నారు అభిమానులు.