సీఎల్పీ విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు కాంగ్రెస్ విప్ సంపత్ ప్రకటించారు. సొంత పార్టీ నేతలపై అసంతృప్తిగా ఉన్న సంపత్ తాను విప్ పదవికి రాజీనామా చేస్తున్నానన్నారు. అసెంబ్లీలో ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళికపై తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం పై పార్టీ నేతలపై సంపత్ ఆగ్రహంతో ఉన్నారు. సొంత పార్టీ నేతల వైఖరికి నిరసనగా అసెంబ్లీకి నల్ల కండువాతో హాజరైన సంపత్ మాట్లాడే అవకాశం ఇచ్చేలా తమ సభ్యులు మద్దతు ఇవ్వలేదని అన్నారు. తమ పార్టీ నేతలతో తనకు సహకారం ఇవ్వడకపోవడం పై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.