ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోమరోసారి తీవ్ర ఉధ్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అధికార ప్రతిపక్షాల సభ్యులు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విరుచుకుని పడ్డారు. స్పీకర్ పోడియం వద్ద అధికార ప్రతిపక్ష సభ్యులు మాటల యుద్ధం దాటి ఒకరిని ఒకరు తోసుకునే వరకు పరిస్థితి వచ్చింది. అసెంబ్లీలో అగ్రీగోల్డ్, ఓటుకు నోటు అంశంపై చర్చజరగాలని విపక్ష సభ్యులు పట్టుపట్టగా దీనిపై చర్చకు స్పీకర్ అనుమతించలేదు. దీనితో విపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగిన క్రమంలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. టీడీపీ సభ్యుడు చింతమనేని, వైసీపీ సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు పరస్పరం దూషించుకున్నారు. బయటకి రా తేల్చుకుందాం అంటూ ఒకరిపై ఒకరు దూసుకుని వచ్చే ప్రయత్నం చేశారు. చింతమనేేనికి ఎమ్మెల్యేలు వంశీ, ప్రభాకర్ చౌదరిలు అండగా నిలవగా చెవిరెడ్డికి శివప్రసాద్ రెడ్డి తోడయ్యాడు. దీనితో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
సభలో దుషణల పర్వం దాటి ఎమ్మెల్యేలు పరస్పరం దాడులు చేసకునే స్థితికి చేరడంలో సీనియర్ సభ్యులు కల్పించుకుని పరిస్థితి మరింత చేయిదాటకుండా చూశారు. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతీ రోజు అధికార విపక్షాలు ఒకరిపై ఒకరి తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. సభలో విమర్శలకు తోడు మీడియా సెంటర్ వద్ద కూడా ఎమ్మెల్యేలు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. విమర్శలు ప్రతివిమర్శల స్థాయి దాటి వ్యక్తిగత ఆరోపణలు, తెల్చుకుందాం రా అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు.