సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న సమాచారంపై నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఈ మేరకు పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న సమాచారం మరీ శృతిమించుతుండడంతో ప్రభుత్వం ఈ చర్యకు దిగింది. వాట్సప్, ఫేస్ బుక్ లలో ప్రచారం అవుతున్న విషయాలు అభ్యతరం కరంగా ఉండడంతో పాటుగా కొంత మంది మనోభావాలను గాయపర్చేవిగా ఉంటున్నాయి. పోటీలు పడిమరి తమకు అనుకూలంగా ప్రత్యర్థులకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల ద్వారా చేస్తున్న ప్రచారం వల్ల ఇబ్బందులు తలెత్తుతుండడంతో ప్రభుత్వం ఈ చర్యకు పూనుకుంది.
ఇటీవల కాలంలో వాట్సప్ లలో ప్రచారం అవుతున్న విషయాలు ప్రభుత్వానికి తలనొప్పులుగా మారాయి. వివిధ అంశాలపై జరుగుతున్న ప్రచారం అడ్డు అదుపు లేకుండా సాగుతోంది. అబద్దపు ప్రచారాలతో పాటుగా అసభ్యపు రాతలు రాసేవారిని వాటిని ప్రచారం చేసేవారిపైనా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సమాజిక మాధ్యమాలే వేదికగా జరుగుతున్న రెండు వర్గాల యుద్ధాల వల్ల కొన్ని సార్లు శాంతి భద్రతల సమస్యలు కూడా తలెత్తే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో సోషల్ మీడియాపై నియంత్రణ విధించాలనేే ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నాయి. చట్టసభలను కించపర్చే విధంగా ఉన్న వ్యాఖ్యాలు ఎక్కువ కావడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. మహిళలను కించపర్చేే రాతలతో పాటుగా సమాజంలో అశాంతిని కలిగించే లాగా ఉన్న పోస్టులపై ప్రభుత్వం దృష్టిపెడుతున్నట్టు సమాచారం.