అమెరికాలో మరో దారుణం జరిగింది. ఇద్దరు తెలుగు వారు దారుణ హత్యకు గురయ్యారు. న్యూజెర్సీలోని మ్యాపుల్ సెట్ లో ఈ దారుణం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా తిమ్మరాజుపాలెంకు చెందిన నర్రా హనుమంతరావు కుటుంబం న్యూజెర్సీలో నివాసం ఉంటోంది. ఆయన భార్య భార్య శశికళ(40), కుమారుడు ఏడు సంవత్సరాల అనీష్ సాయిలు హత్యకు గురయ్యారని హనుమంతరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత తొమ్మిది సంవత్సరాలుగా హనుమంతరావు అమెరికాలో ఉంటున్నారు. ఆయన రాత్రి 7.00 గంటల సమయంలో ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన తరువాత భార్యా, కుమారుడి రక్తపు మడుగులో కనిపించారు. దీనితో ఆయన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో నుండే పనిచేసే తన భార్య శశికళ సాయంత్ర బాబును స్కూల్ నుండి తీసుకుని వచ్చారని 7.00 గంటలకు తాను ఇంటికి వచ్చే సరికి ఈ దారుణం జరిగిందని హనుమంతరావు పోలీసులు తెలిపారు. తల్లీ కొడుకులను గొంతు కోసి హత్యచేశారని పోలీసులు గుర్తించారు. మృత దేహాలను ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.