ఉత్తర్ ప్రదేశ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ముస్లిం వక్ఫ్, హజ్ శాఖల మంత్రి మోహ్సిన్ రజా కు కోపం వచ్చింది. తన కార్యాలయానికి వచ్చిన మంత్రికి గోడపై ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్, సమాజ్ వాదీ పార్టీనేత ఆాంఖాన్ ల ఫొటోను చూసి షాకయ్యాడు. ఈ ఫొటోను ఇక్కడ ఎవరు ఉంచారంటూ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యలయ సిబ్బంధిని పిల్చి వీరి ఫొటో తన కార్యాలయంలో ఎందుకు ఉందంటూ ప్రశ్నించారు. ఆ ఫొటోను తియాల్సిందిగా తమకు ఎవరూ చెప్పలేదని మంత్రి కార్యాలయ సిబ్బంది చెప్పడం మంత్రికి మరింత ఆగ్రహం తెప్పించింది. ప్రస్తుతం ఎవరి ప్రభుత్వం నడుస్తోందో తెలియదా అంటూ వారిపై మండిపడ్డారు. వెంటనే ఈ ఫొటోను తీసేయాలని చివాట్లు పెట్టారు. దీనితో మంత్రి కార్యాలయ సిబ్బంది ఆ ఫొటోను అక్కడి నుండి తీసేయడంతో పాటుగా ఇంకా పాత ప్రభుత్వానికి సంబంధించిన ఫొటోలు ఎక్కడెక్కడా ఉన్నాయో చూసే పనిలో పడ్డారు.