భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు, పంజాబ్ పంజాబ్ స్థానిక సంస్థలు, ఆర్కీవ్స్, మ్యూజియంలు, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల మంత్రి నవజ్యోత్ సింగ్ సిధ్దు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత కూడా టీవీ షోలకు హాజరవుతానని చెప్పడంతో పాటుగా అధికార సమావేశాలకు తన భార్యతో సహా హాజరు కావడంపై విపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత టీవీ షోలకు హాజవుతానని సిద్ధూ తేల్చి చెప్పారు. నెలలో నాలుగా రోజులు టీవీ షో షూటింగ్ ఉంటుందని వాటిల్లో పాల్గొంటే తప్పేంటని సిద్ధు ప్రశ్నిస్తున్నాడు. నెలలో నాలుగు రోజులు మాత్రామే తాను టీవీ షోలకు హాజరవుతానని మిగతా రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటానని సిద్ధూ చెప్తున్నాడు. తాను చేస్తోంది టీవీ షోలు మాత్రమేనని అవినీతి కార్యక్రమాలకు పాల్పడడం లేదని సిద్ధూ అంటున్నాడు. తాను బస్సులు నడపడం లేదని మాజీ డిప్యూటీ సీఎం సుఖ్ బీర్ సింగ్ ను ఉద్దేశించి సిద్ధూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
మరో వైపు అధికార సమావేశాలను తన భార్యను తీసుకుని రావడం పై సిద్ధూ స్పందిస్తూ ఆమె తనలో అర్థభాగం అంటూ వ్యాఖ్యానించాడు. పంజాబ్ మంత్రిగా బాధ్యతలు తీసుకుని కొద్ది రోజులు కూడా కాక ముందే సిద్ధూ వివాదాల్లో ఇరుక్కోవడం పై పంజాబ్ ముఖ్యమంత్రి కూడా అసహనంతో ఉన్నట్టు సమాచార. సిద్ధూ మంత్రిత్వ శాఖలను మార్చే ఆలోచనలో కూడా సీఎం అమరీందర్ ఉన్నట్టు సమాచారం.