చిన్నారి పెళ్లి కూతుళ్లు…

విశ్వనగరం హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న ప్రాంతం అది… ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి… బంధువులు స్నేహితులతో అక్కడ పండుగ వాతావరణం లాగా ఉంది… ఆ ఇంట్లో పెళ్లికి ముస్తాబవుతున్న పెళ్లికూతురు ముఖంలో మాత్రం విషాదఛాయలు… తాను చదువుకుంటానన్నా పెద్దలు ఒప్పుకోక ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారు… ధైర్యం తెచ్చుకున్న పెళ్లికూతురు పోలీసులకు సమాచారం ఇవ్వడంలో పోలీసులు వచ్చి పెళ్లిని అడ్డుకుని ఇరువురి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పట్టుమని 15 సంవత్సరాల కూడా లేని ఆ అమ్మాయికి పెళ్లిచేయడం నేరమని చెప్పిన పోలీసులు పెళ్లి పనులను ఆపించి వెళ్లిపోయారు.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బాల్య విహావాలు పెద్ద సంఖ్యలో జరుగుతుండడంతో వీటిపై అధికారులు దృష్టి పెట్టారు. బాల్య వివాహాలను అడ్డుకునే ప్రయత్నంతో కొత్త విధానాలను అవలంబిస్తున్నారు. పెళ్లితో ముడిపడిన వ్యాపారస్తులు, బ్రాహ్మణుల సహకారంతో బాల్యవిహాలను అడ్డుకునే పనిలో పడ్డారు. పెళ్లికోసం  వేయించే శుభలేకలు ప్రింటర్లు, ఫంక్షన్ హాళ్ల యజమానులు, టెంట్ హైస్ ల యజమానులు, పెళ్లిళ్లు చేయించే బ్రాహ్మణులను పిలిపి బాల్య వివాహ చట్టాలపై వారికి అవగాహన కల్పిస్తున్నారు. పెళ్లికోసం తమ వద్దకు వచ్చే వారి తల్లిదండ్రులు, పెద్దలు ముందుగా పెళ్లికూతురు, పెళ్లి కుమారుడికి తగిన వయసు ఉందని నిర్థారించుకున్న తరవాత పెళ్లి పనులను చేయాలని ఆదేశించారు. పెళ్లి పెద్దల నుండి ఈ మేరకు దృవీకరణ పత్రం తీసుకోవడంతో పాటుగా పెళ్లి కుమారుడి, కుమారైది వయసు ధృవీకరణ పత్రం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒక వేళ బాల్య వివాహాలకు సహకరించినట్టయితే కేసులు పెట్టాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో జరుగుతున్న విహావాహాల్లో 30 శాతం బాల్యవివాహాలే నని ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసి భారం దించుకోవాలనే ఆలోచనలో తల్లిదండ్రులు ఉండడంతో  13 నుండి 15 సంవత్సరాల మధ్య వయసులోనే వారికి పెళ్లిళ్లు చేసేస్తున్నారు. నిరక్షరాస్యులతో పాటుగా చదువుకున్న వారు కూడా తమ పిల్లలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేస్తున్నారు. కనీస వివాహ వయసుపై  ప్రచారం నిర్వహిస్తున్నారు. చట్టం ప్రకారం కనీస వివాహ వయసు అమ్మాయిలకు 18 సంవత్సరాలు కాగా అబ్బాయిలకు 21 సంవత్సరాలు బాల్య వివాహాలు చేసిన వారికి లక్ష రూపాయల జరిమానా లేదా రెండు సంవత్సరాల కారాగార శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *