ఆ సినిమాకు వచ్చింది ఓకే ఒక్కడు…

అది ఒక ప్రముఖ దర్శకుని సినిమా…రిలీజైన రెండో రోజు… ముంబాయి నడిబొడ్డున ఉన్న జూహూ పీవీఆర్ సినిమా టాకీస్… సినిమా మొదలు పెడదాం అనుకున్న ధియోటర్ యాజమాన్యానికి దిమ్మతిరిగింది. సినిమా చూడ్డానికి వచ్చింది కేవలం ఒక్కడంటే ఒక్కడే… అదోదో సినిమాలో చూపించినట్టు టికెట్లన్నీ ఈయనగారు ఒక్కడే కొనేయలేదు. నిజంగానే ఒక్కరు మాత్రమే సినిమా చూడ్డానికి రావడంతో కళ్లు బైర్లు కమ్మిన ధియేటర్ యాజమాన్యం షోను రద్దు చేసిందిట. ఇంతటి ఘనకార్యం సాధించిన ఈ సినిమా పేరు “మెషిన్” . అబ్బాస్-మస్తాన్ దర్శకత్వంలో కైరా అధ్వానీ, ముస్పఫా బర్మావాల నటించిన ఈ చిత్రం మొదటిరోజే చెత్తసినిమాగా పేరుతెచ్చుకుంది. సినిమా సంగంలోనే బతుకుజీవుడా అంటూ ప్రేక్షకులు సినిమా హాల్ నుండి బయటకు వచ్చేశారట. ఇక రెండో రోజూ పరిస్థితి మరీ దారుణం కేవలం ఒకే ఒక్క ప్రేక్షకుడు రావడంతో సినిమా షోను రద్దు చేశారట. సినిమాకి వచ్చిన ఒకరు కూడా ఏదో పని నిమిత్తం వస్తే మధ్యంలో మూడు గంటలు టైంపాస్ చేయడం కోసం సినిమా టికెట్ తీసుకున్నాట్టా.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *